: ఇలాంటి ఫత్వాలకు భయపడను: మోడల్ అర్షి ఖాన్


పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీతో గడిపానని, అతడితో పడుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మోడల్ అర్షి ఖాన్. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మపై పాకిస్థాన్ లోని ఓ వర్గం మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ఫత్వాపై అర్షి ఖాన్ కూడా ఘాటుగానే స్పందించింది. "పాకిస్థాన్ తీరు నాకు ఏ మాత్రం నచ్చలేదు. చాలా దారుణంగా ఉంది. నాకు ఎంతో నిరాశను కలిగించింది. నాకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయినా... ఇంత వరకు నాకు మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. పాకిస్థాన్ కళ్లు తెరువు" అంటూ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఫత్వాలకు తాను భయపడనని... ఏ ముఫ్తీ కాని, శివసేన కాని తనను ఏమీ చేయలేవని తెలిపింది.

  • Loading...

More Telugu News