: బ్రిటన్ వర్శిటీల్లో నయాట్రెండ్... చదువుకోసం 'షుగర్ బేబీ'లుగా మారుతున్న అమ్మాయిలు!


చాలినంత డబ్బులేక చదువును మధ్యలోనే ఆపేసేవారు కొందరుంటే, మరికొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొంత డబ్బు సంపాదించుకుని దాంతో విద్యను అభ్యసిస్తుంటారు. కానీ, బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదా? అక్కడి యూనివర్శిటీల్లో కొత్త ట్రెండ్ వచ్చేసింది. కొన్ని ప్రత్యేక వెబ్ సైట్లు స్టూడెంట్ల కోసమే డేటింగ్ సేవలను ప్రారంభించాయి. విద్యార్థినీ విద్యార్థులు చేయాల్సిందల్లా, ఈ సైట్లల్లో తమ వివరాలు, ఫోటోలను పెట్టి ఆపై అదృష్టాన్ని పరీక్షించుకోవడమే. ఎవరైనా ముసలి వాళ్లు, ధనవంతులు దొరికితే వారి పంట పండినట్టే. నెలకు రెండు వేల యూరోలు, అంటే మన కరెన్సీలో రూ. 1.40 లక్షల వరకూ సంపాదించుకోవచ్చు. ఇలా డేటింగ్ కు సిద్ధమని ప్రకటించే అమ్మాయిలను 'షుగర్ బేబీ'లుగా పిలుస్తున్నారు. వారిని ఆహ్వానించే ఓల్డ్ రిచ్ మ్యాన్ లను 'షుగర్ డాడీ'లంటున్నారు. ఈ తరహా డేటింగ్ సర్వీసెస్ అందిస్తున్న 'సీకింగ్ అరేంజ్ మెంట్స్ డాట్ కాం'లో 12 వేల మంది విద్యార్థుల పేర్లు, చిత్రాలు ఉన్నాయంటే, బ్రిటన్ లో ఈ డేటింగ్ ఎంతగా పాప్యులర్ అయిందో తెలుసుకోవచ్చు. ఇదేమీ వ్యభిచారం కాదని, ఒంటరిగా ఉంటూ, మానసిక సాహచర్యాన్ని వారు కావాలని అనుకుంటారని, ఇక లైంగిక బంధం చిట్టచివరిదని అంటున్నారు.

  • Loading...

More Telugu News