: కీచకుడిపై లుకౌట్ నోటీసు... విదేశాలకు పారిపోయేందుకు ‘కృపామణి’ నిందితుడి యత్నం


గృహిణిపై కీచక పర్వం సాగించిన దుర్మార్గుడు పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నాడట. దుర్మార్గుడి పన్నాగాన్ని పసిగట్టిన పోలీసులు అతడిని నిలువరించేందుకు ఏకంగా లుకౌట్ నోటీసులను జారీ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి అనే గృహిణిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడే వ్యభిచార రొంపిలోకి దింపారు. ఈ క్రమంలో గూడాల సాయి శ్రీనివాస్ అనే రౌడీ షీటర్ కృపామణిపై నెలల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు సూసైడ్ నోట్ రాయడమే కాక, తన ఆవేదనను సెల్పీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించడంతో పోలీసు బాసులు నేరుగా రంగంలోకి దిగారు. అయితే కేసు వెలుగు చూసిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ తాజాగా విదేశాలకు చెక్కేసేందుకు యత్నిస్తున్నాడట. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు.

  • Loading...

More Telugu News