: తెలంగాణలో 'టెట్' వేరు 'డీఎస్సీ' వేరు... 3 లక్షల మందికి ఆందోళన!


టీచరు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న దాదాపు 3 లక్షల మందికి ఆందోళనను పెంచుతూ, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. జనవరి 24న టెట్, ఆపై మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పరీక్షలనూ కలిపి నిర్వహిస్తుంటే, ఇక్కడ విడగొట్టడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టెట్ లో అర్హత సాధించడం తప్పనిసరి పేరిట ఉద్యోగ నియామక పరీక్షల్లో పాల్గొనకుండా అభ్యర్థులను దూరం పెట్టడం అన్యాయమని అంటున్నారు. ఈ రెండింటినీ కలిపి నిర్వహించాలని, మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరపాలని కోరుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో 10,961 టీచరు పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సి వుంది.

  • Loading...

More Telugu News