: అరేబియాపై దూసుకెళ్లిన బ్రహ్మోస్... మరో మెట్టెక్కిన భారత యుద్ధ సామర్థ్యం!
అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ కోచి నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. సుమారు 290 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన బ్రహ్మోస్ విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ తరహాలో తయారైన క్షిపణిని పూర్థి స్థాయి దూరంలోని లక్ష్యంపై ప్రయోగించినట్టు ఆయన వివరించారు. సముద్ర ఉపరితలంపై నిలిచివుండే సుదూర యుద్ధనౌకలను దీని సాయంతో సులువుగా ముంచేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో భారత యుద్ధ సామర్థ్యం మరో మెట్టెక్కినట్లయింది. కాగా, గత సంవత్సరం జూన్ లో, ఆపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎన్ఎస్ కోల్ కతా నుంచి బ్రహ్మోస్ ను పరీక్షించిన సంగతి తెలిసిందే.