: సానియా... నీ ఆట అదుర్స్: టెన్నిస్ స్టార్ కు కేసీఆర్ అభినందన


భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా విజయాల బాటలో దూసుకెళుతోంది. ఒకప్పటి వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జతకట్టిన తర్వాత సత్తా చాటుతున్న సానియా నిన్న డబ్ల్యూటీఏ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ టైటిల్ తో ఒకే ఏడాదిలో సానియా, హింగిస్ జంట 9 టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నట్లైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సానియాకు అభినందనలు తెలిపారు. ‘‘ఏడాదిలో తొమ్మిది టైటిళ్లు నెగ్గడం గొప్ప విషయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆయన సానియాకు అభినందన సందేశం పంపారు.

  • Loading...

More Telugu News