: టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం: ఎర్రబెల్లి, రమణ


వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రేపు ప్రకటించనున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మాట్లాడుతూ, ఈ ఉపఎన్నికలో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. టీ-సర్కార్ నెరవేర్చిన హామీలేమిటో చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. కాగా, వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన తమ తమ అభ్యర్థులను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ నుంచి దయాకర్, కాంగ్రెస్ నుంచి రాజయ్య బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News