: బీహార్ లో ముగిసిన నాలుగో విడత పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 7 జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, అక్టోబర్ 12న తొలి విడత, అక్టోబర్ 16న రెండో విడత, అక్టోబర్ 28న మూడో విడత పోలింగ్ జరిగాయి. ఈరోజు నాలుగో విడత పోలింగ్ జరిగింది. ఈనెల 5న ఐదో విడత పోలింగ్, ఈ నెల8వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది.