: బల్కంపేట్ లో వాహనాలపై దూసుకెళ్లిన లారీ : ఒకరు మృతి
లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్ లోని బల్కంపేట్ లో జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో నాలుగు కార్లు, రెండు ఆటోరిక్షాలు, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు.