: డబ్ల్యూటీఏ డబుల్స్ విజేతగా సానియా జోడీ
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్ విజేతగా సానియా జోడీ నిలిచింది. ఫైనల్ లో స్పెయిన్ జోడీ ముగురుజా-నవర్రో పై సానియా-హింగిస్ జంట తలపడింది. ఫైనల్ లో 6-0,6-3 సెట్ల తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది. సింగపూర్ లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో గెలుపు సాధించిన ఇండో-స్విస్ జంట సానియా-హింగిస్ లు ఈ సీజన్ లో మరో డబుల్స్ టైటిల్ ను తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. కాగా, సానియా-హింగిస్ జోడీ విజయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.