: తగిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే పనిచేయద్దు: సోనమ్ కపూర్
‘మనం కష్టపడి పనిచేసిన దానికి తగిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే పనిచేయకూడదు. కష్టపడి పనిచేసి సరైన పారితోషికం అందనిపక్షంలో దాని కోసం పోరాడాల్సిందే’ అని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వ్యాఖ్యానించింది. ముంబయిలో జరిగిన మామీ ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన సోనమ్ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా రెమ్యూనరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ హీరోల కంటే హీరోయిన్ లకే పారితోషికం ఎక్కువగా ఇస్తున్న విషయం ఇటీవల చర్చనీయాంశమైంది. కాగా, ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సల్మాన్ సరసన సోనమ్ నటించింది.