: మంత్రి గంటాతో పాటు పలువురు నేతలను టెన్షన్ పెట్టిన ట్రూజట్ విమానం!
ఏపీ మంత్రి నారాయణ కుమార్తెతో తన కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, తిరుగు ప్రయాణానికి ట్రూజెట్ విమానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోగా, అది టెన్షన్ పెట్టింది. మంత్రి గంటాతో పాటు పలువురు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, నేతలు విమానంలో ఉండగా, విశాఖపట్నంలో ల్యాండ్ కావాల్సిన విమానం గంట పాటు ఆకాశంలోనే చక్కర్లు కొడుతూ ఉండిపోయింది. విశాఖ మేఘావృతమై, వర్షం పడుతుండటంతో ఈ విమానం దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో విమానం గాల్లోనే ఉండిపోగా, నేతలంతా కొంత ఆందోళనకు గురయ్యారు. మేఘాలు కాస్త తెరిపివ్వగానే విమానం దిగేందుకు అనుమతి లభించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.