: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన పెట్రోల్ ధరలు ఇవే
లీటరు పెట్రోలు ధరను 50 పైసల మేరకు తగ్గిస్తూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న రూ. 2 తగ్గిన ధరను ఆపై 15వ తేదీన యథాతథంగా ఉంచిన ఓఎంసీలు నిన్న ధరను స్వల్పంగా తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రాగా, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 61.20 నుంచి 60.70కి తగ్గింది. ఇక కోల్ కతాలో రూ. 66.11, ముంబైలో రూ. 67.77, చెన్నైలో రూ. 61.02, హైదరాబాద్ లో రూ. 65.79లకు లీటరు పెట్రోల్ లభిస్తుంది.