: హర్భజన్ సింగ్ పై అకల్ తఖ్త్ లో ఫిర్యాదు
సిక్కుల అత్యున్నత పెద్దల సంఘం అకల్ తఖ్త్ లో క్రికెటర్ హర్భజన్ సింగ్ పై ఫిర్యాదు నమోదైంది. అకాలీ దళ్ సీనియర్ యూత్ లీడర్ జర్నైల్ సింగ్ గర్దివాల్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. గురుద్వారాలోకి భక్తులు వెళ్లకుండా ఆయన అడ్డుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. ఇది సిక్కు మతస్తుల విశ్వాసాలకు వ్యతిరేకమని, గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయనెవరని ప్రశ్నించారు. పంజాబ్ లోని గురుద్వారాల్లో ఇప్పటివరకూ ఏ సెలబ్రిటీ కూడా బౌన్సర్లను వాడలేదని ఆయన తెలిపారు. కాగా, మీడియాపై దాడి చేసిన కేసులో హర్భజన్ బౌన్సర్లు నవజ్యోత్, కులదీప్, రవి, బబ్లూలపై కేసు దాఖలైన సంగతి తెలిసిందే.