: ఐఎస్ఐఎస్ కు అంతసీన్ లేదు: స్పష్టం చేసిన ఈజిప్టు
ఈజిప్టులోని సినాయి ద్వీపకల్పంలో కూలిపోయిన రష్యా కు చెందిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానాన్ని తామే కూల్చేశామంటూ ఐఎస్ఐఎస్ చేసిన ప్రకటనను ఈజిప్టు అధికారులు ఖండించారు. ఐఎస్ఐఎస్ కు అంత సీన్ లేదని తెలిపారు. ఐఎస్ఐఎస్ కు విమానాన్ని కూల్చేసే పరిజ్ఞానం లేదని ఈజిప్టు అధికారులు స్పష్టం చేశారు. భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులకు కేవలం 32 వేల అడుగుల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం మాత్రమే ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ ప్రకటన అవాస్తవమని వారు పేర్కొన్నారు.