: పైలట్ కు 12 వేల గంటల అనుభవం...సాంకేతిక లోపం లేదు: కొగల్మావియా ఎయిర్ లైన్స్


నేటి మధ్యాహ్నం ఈజిప్టులోని సినాయి పర్వత ప్రాంతంలో కూలిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం లేదని ఆ సంస్థ తెలిపింది. ప్రమాదంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సదరు ఎయిర్ లైన్స్ పెదవి విప్పింది. విమానం నడిపిన పైలట్ కు 12 వేల గంటలు విమానం నడిపిన అనుభవం ఉందని తెలిపింది. అలాగే విమానంలో కూడా ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేసింది. 1993లో కొగల్మావియా ఎయిర్ లైన్స్ ను ఏర్పాటు చేయగా, దాని పేరును 2012లో మెట్రో జెట్ గా మార్చారు. కాగా, ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం హై-లెవెల్ అథారిటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News