: తీవ్రవాద దాడుల్లో చనిపోయిన వారికిచ్చే పరిహారాన్ని పెంచిన టి.ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాద దాడుల్లో చనిపోయిన పోలీసులు, ఇతర వ్యక్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని భారీగా పెంచింది. ఉద్యోగుల స్థాయుల వారీగా ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో హోంగార్డు కుటుంబాలకు రూ.30 లక్షలు, ఇతరులకు రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్.ఐ స్థాయి అధికారులకు రూ.45 లక్షలు, ఇన్ స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు రూ.50 లక్షలు, ఎస్పీలు, ఐపీఎస్ ల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అవనున్నాయి.