: ఎన్నికల్లో దయాకర్ తరపున పార్టీయే ఖర్చు పెడుతుంది: సీఎం కేసీఆర్
వరంగల్ లోక్ సభకు టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పసునూరి దయాకర్ గెలుపుకు అందరూ కలసి కృషి చేద్దామని సీఎం కేసీఆర్ కోరారు. ఆయన డబ్బులున్న వాడు కాదని, అందుకని ఆయన గెలుపు కోసం కలసి పనిచేద్దామని తెలిపారు. తెలంగాణభవన్ లో ఇవాళ వరంగల్ జిల్లా నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. తరువాత దయాకర్ కు బీ ఫామ్, ఏ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో దయాకర్ లేరన్నారు. ఆయనకు పార్టీయే ఫండ్ ఇస్తుందని, ఆ డబ్బుతోనే దయాకర్ గెలుస్తారని చెప్పారు. వీలైతే ఇప్పటికిప్పుడే పార్టీ తరపున చెక్కు ఇచ్చి పంపుతామని కేసీఆర్ పేర్కొన్నారు.