: అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల బృందం... ఉద్దండరాయునిపాలెం, న్యాయనగరి పరిశీలన
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల బృందం పర్యటిస్తోంది. బృందంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే, జస్టిస్ జి.చంద్రయ్య, జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉన్నారు. ముందుగా న్యాయమూర్తుల బృందం గుంటూరు జిల్లాలో శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించింది. ఈ సమయంలో రాజధాని త్రీడీ నమూనాను పరిశీలించారు. తరువాత న్యాయనగరి నిర్మాణ ప్రతిపాదిత స్థలం పరిశీలించారు. ఆ తరువాత శాకమూరు, నేలపాడు, ఐనవోలు గ్రామాల మధ్య స్థలాన్ని పరిశీలిస్తున్నారు.