: విమానం రెండు ముక్కలైంది...విద్రోహ చర్యేనా?


ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయల్దేరిన రష్యన్ ఎయిర్ బస్ 321 విమానం సినాయ్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం రెండు ముక్కలైందని సంఘటనా స్థలికి చేరిన భద్రతాధికారి తెలిపారు. ఘటనాస్థలంలో ఐదుగురు చిన్నారులు సహా వంద మృత దేహాలను గుర్తించినట్టు ఆ అధికారి వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయని ఆయన పేర్కొన్నారు. కాగా, విమానం రెండు ముక్కలైందని ఆయన పేర్కొనడంతో విమానం ప్రమాదవశాత్తు కూలిపోయి ఉంటుందని భావించడం లేదని, ఉగ్రవాద చర్యే అయి ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విమానం కూలిపోయిన సమయానికి అందులో సిబ్బంది సహా మొత్తం 224 మంది ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News