: కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోస్తా తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. బలంగా వీచే గాలుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.