: వారి నిర్ణయంపై నేను మాట్లాడలేను... మాట్లాడితే పరిస్థితి విషమించే అవకాశం ఉంది: అమితాబ్
దేశంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను నిరసిస్తూ పలువులు రచయితలు, దర్శకులు, చరిత్రకారులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను మీడియా ప్రతినిధులు కోరారు. దీనికి సమాధానంగా, వారు తీసుకున్న నిర్ణయాలపై తాను మాట్లాడలేనని... సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడే ముందు విచక్షణతో వ్యవహరించాలని... విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉందని చెప్పారు. కొంత మంది సెలబ్రిటీలు ఈ అంశంపై వారికి తోచిన విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని... అది సరైనది కాదని అన్నారు. ఏదైనా ఒక వివాదాన్ని సృష్టించడం లేదా అనవసరంగా రాద్ధాంతం చేయడం లాంటివి వ్యక్తిగతంగా తనకు ఇష్టం ఉండవని బిగ్ బీ తెలిపారు.