: గల్లంతైన రష్యా విమానం కూలిపోయింది... ఈజిప్ట్ ప్రధాని ప్రకటన
గగనతలంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్ట్ నగరం షామ్ అల్ షేక్ నుంచి రష్యా బయలుదేరిన రష్యన్ విమానం సినాయ్ దీవుల్లో కూలిపోయింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఈజిప్ట్ ప్రధాని ఇబ్రహీం మహ్లాబ్ ఓ ప్రకటన్ చేశారు. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం కలిసి 212 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు రష్యాకు చెందినవారేనని తెలుస్తోంది. షామ్ అల్ షేక్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం కొద్దిసేపటికే ఈజిప్ట్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత టర్కీ గగనతలంలో విమానం ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు వెలువడ్డ క్షణాల్లోనే ప్రమాదం సంభవించిందని ఈజిప్ట్ ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.