: బట్టలు వేసుకోవడమంటే ఎలర్జీ అంటున్న సల్మాన్!
సినిమాల్లోనూ, ప్రత్యేక షోల్లోను రకరకాల దుస్తులు ధరించే సల్మాన్ ఖాన్ నిజజీవితంలో అసలు దుస్తులు వేసుకోవాలంటేనే చిరాకుపడతానని చెబుతున్నాడు. ఐఐటీ అహ్మదాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్స్ రూపొందించిన ఖాదీ దుస్తులను ధరించి సల్మాన్ ర్యాంప్ వాక్ చేశాడు. ఈ సందర్భంగా ఫ్యాషన్ దుస్తులకు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయని, ఖాదీ భారత్ లో మొదటగా తయారైనందుకు మనమంతా చాలా గర్వపడాలని చెప్పాడు. అసలు తనకు బట్టలు వేసుకోవడమంటేనే ఎలర్జీగా ఉంటుందని, అవి వేసుకుంటే తనకు ఏదోలా ఉంటుందని అన్నాడు. తనకవి అంతగా సౌకర్యంగా ఉండవని అంటున్నాడు. కావాలంటే తన ఇంటికి వచ్చి చూడచ్చని, తన తండ్రి సలీంఖాన్ కూడా తక్కువగా బట్టలు వేసుకుంటారని సల్లూ వెల్లడించాడు. తానెక్కువగా ప్యాంట్, బనియన్ మాత్రమే వేసుకుంటానని, అప్పుడప్పుడు షర్ట్ మాత్రం ధరిస్తానని చెప్పుకొచ్చాడు.