: రష్యా విమానం గల్లంతు... విమానంలో 200 మంది ప్రయాణికులు


గగనతలంలో మరో కలకలం రేగింది. 200 మంది ప్రయాణికులతో నింగికెగసిన రష్యాకు చెందిన విమానం అడ్రెస్ గల్లంతైంది. ఈజిప్ట్ నుంచి రష్యాకు బయలుదేరిన సదరు విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఈజిప్ట్ లోని సినాయి ద్వీపకల్పాన్ని దాటుతుండగా ఈ విమానం ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. విమానం గల్లంతైన సమాచారంతో అటు రష్యాలోనే కాక ఈజిప్ట్ లోనూ కలవరం మొదలైంది. విమానం ఆచూకీ కోసం ఇరు దేశాలకు చెందిన ఏవియేషన్ అధికారులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News