: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్ఎస్ లో చేరుతున్నా: గుండు సుధారాణి


టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని స్వయంగా ఆమె మీడియాకు తెలిపారు. పార్టీలో ఎప్పుడు చేరాలనే దానిపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు టీఆర్ఎస్ నుంచి ఫోన్ వచ్చిందని, నేడు చేరితే బాగుంటుందని చెప్పారని గుండు వివరించారు. ఈ మేరకు ఓ తెలుగు చానల్ తో ఆమె మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకు, టీఆర్ఎస్ పాలనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి అభివృద్దిలో పాలు పంచుకోవాలనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు. టీడీపీలో ఎవరితోనూ తనకు గొడవలు లేవన్నారు. అంతేగాక ఎలాంటి పదవులు ఆశించి టీఆర్ఎస్ లో చేరడం లేదని సుధారాణి ఉద్ఘాటించారు. కేవలం అభివృద్దిలో మాత్రమే తాను ఓ భాగస్వామి కావాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. టీఆర్ఎస్ లో అందరినీ కలుపుకుని వెళతానని, తనవంతు సాయం చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News