: వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన టీడీపీ నేతలు...తల్లితో కలిసి వచ్చిన పరిటాల శ్రీరామ్


టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు నేటి ఉదయం తిరుమల వెంకన్న సన్నిధికి క్యూ కట్టారు. నిన్న రాత్రి నెల్లూరులో జరిగిన మంత్రి నారాయణ కూతురు వివాహానికి హాజరైన నేతల్లో చాలా మంది నేటి ఉదయం తిరుమలకు వచ్చారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. టీడీపీ యువ నేత, పరిటాల తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా తన తల్లి సునీతతో కలిసి వెంకన్న సేవలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News