: తెలంగాణలో నవంబర్ 17న ప్రభుత్వ భూముల తొలి వేలం


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను వేలం వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడత వేలాన్ని నవంబర్ 17న నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని షేక్ పేట్ మండల పరిధిలోని సుమారు 10 ప్రాంతాల్లోని 3.25 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ వేలంలో ఎలాంటి వివాదాలు లేని భూములకు స్థానం కల్పించారు. మార్కెట్ విలువ ప్రకారం వేలం ధరను నిర్ణయించారు. నందినగర్ ప్రాంతంలో గజానికి రూ.లక్ష, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పలు స్థలాలకు గజానికి రూ.75 నుంచి 80వేల ధర నిర్ణయించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News