: మన దేశంలో అత్యధిక కాలుష్యం ఢిల్లీలోనే... ఎందుకంటే...!


మన దేశ రాజధాని ఢిల్లీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరం. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఇది ఒకటి. ఢిల్లీలో అత్యధిక కాలుష్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతంలోనే తెలిపింది. మన దేశంలో ఇన్ని నగరాలుండగా ఢిల్లీలోనే ఇంత ఎక్కువగా కాలుష్యం ఎందుకు ఉంటోంది? దీనికి కారణాలను ఓ తాజా సర్వే వెల్లడించింది. భౌగోళిక పరిస్థితుల కారణంగానే ఢిల్లీలో ఈ స్థాయిలో కాలుష్యం ఉంటోందని సర్వే తేల్చి చెప్పింది. దీనికి తోడు వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్యం, పరిశ్రమలు వెదజల్లుతున్న రకరకాల విష రసాయనాలు ఢిల్లీని కాలుష్య కాసారంగా మార్చేస్తున్నాయని సర్వేను నిర్వహించిన 'యూనివర్శిటీ ఆఫ్ సర్రే'కి చెందిన బృందం తెలిపింది. ఢిల్లీలో అధిక జనాభా కూడా కాలుష్యానికి మరో కారణమని చెప్పింది. పై కారణాలన్నింటి వల్ల ఢిల్లీలో ఆల్ట్రా ఫైన్ పార్టికల్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. ముంబై, చెన్నై లాంటి తీర ప్రాంత నగరాల కన్నా ఢిల్లీలోనే అధిక కాలుష్యం ఉంటోంది.

  • Loading...

More Telugu News