: అందుబాటులోకి మరో 156 మంది ఐపీఎస్ లు...పాసింగ్ అవుట్ పరేడ్ లో అజిత్ దోవల్


దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లోకి నేడు మరో 156 మంది ఐపీఎస్ అధికారులు దూకేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భాగంగా ఐపీఎస్ కు ఎంపికైన 156 మంది యువ అధికారులు శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో నేటి ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో యువ అధికారులు కార్యరంగంలోకి దిగేశారు. శిక్షణను పూర్తి చేసుకున్న 156 మంది ఐపీఎస్ లలో 130 మంది యువకులు ఉండగా, 26 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. యువ ఐపీఎస్ అధికారుల నుంచి దోవల్ గౌరవ వందనం స్వీకరించారు.

  • Loading...

More Telugu News