: ఢిల్లీలో పటేల్ జయంతి వేడుకలు... ఆయన జీవన విధానం ఆచరణీయమన్న ప్రధాని


సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు తదితరులు నివాళులర్పించారు. అనంతరం రాజ్ పథ్ లో మోదీ ప్రసంగిస్తూ, దేశాన్ని ఏకం చేసేందుకు పటేల్ చేసిన కృషిని జాతి ఎప్పటికీ మరిచిపోదన్నారు. పటేల్ రాజకీయ కౌశలం ఎంతో గొప్పదని కొనియాడారు. చాణక్యుడి తరువాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని, దేశ విభజన శక్తులను పటేల్ దీటుగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. పటేల్ జీవన విధానం, సిద్ధాంతాలు సదా ఆచరణీయమన్నారు. పటేల్ అహ్మదాబాద్ లో 222 రోజుల పాటు స్వచ్ఛ అభియాన్ నిర్వహించారని మోదీ ప్రస్తావించారు. అప్పటినుంచే స్వచ్ఛత కార్యక్రమాలకు ముందడుగు పడిందన్నారు. అనంతరం రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అందులో పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News