: వేడుకగా నారాయణ కూతురు, గంటా కొడుకు పెళ్లి... హాజరైన చంద్రబాబు, చిరంజీవి


ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూతురు శరణి, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు రవితేజల వివాహం నిన్న నెల్లూరులో వేడుకలా జరిగింది. ఏపీ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నారాయణ, గంటా కుటుంబాల మధ్య వియ్యం కుదిరింది. ఈ వివాహంతో నిన్నటిదాకా మంత్రివర్గ సహచరులుగా ఉన్న నారాయణ, గంటాలు బంధువులైపోయారు. నెల్లూరులో జరిగిన ఈ వేడుకకు టీడీపీకి చెందిన మెజారిటీ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News