: కళాకారుడు గీసిన ప్రతి చిత్రమూ సృజనాత్మకమే!: సినీనటుడు సుమన్
కళాకారుడికి ఏకాగ్రత ఎంతో అవసరమని ప్రముఖ సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ చిత్రకారుడు హరి గీసిన చిత్రాల ప్రదర్శనను మంత్రి కేటీఆర్ తో కలిసి సుమన్ ప్రారంభించారు. హైదరాబాదు, బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. చిత్రకారుడు గీసిన సుమారు 30 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఆర్టిస్టులు గీసే ప్రతి చిత్రంలోను ఒక సందేశం, సృజనాత్మకతతో పాటు కళాత్మకత కూడా ఉంటుందని ఆయన అన్నారు.