: భారత్ కు తరలిస్తున్న రూ.40 కోట్ల కొకైన్ స్వాధీనం


భారత్ - బంగ్లా సరిహద్దుల్లో సుమారు రూ.40 కోట్ల విలువ చేసే కొకైన్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బంగ్లాదేశ్ నుండి భారత్కు 10 కిలోల కొకైన్ను తరలిస్తుండగా మన భద్రతాదళాలు పట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్ ఉండటాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఆ పౌడర్ ను పరీక్షల నిమిత్తం నార్కోటిక్ లేబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ధ మాదక ద్రవ్యం కోకైన్గా తేలింది. దీని విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News