: దిండుగా వాడితే తలలో దిగబడింది!
స్క్రూ డ్రైవర్ల కిట్ ను తలకింద దిండుగా పెట్టుకుని నిద్రిస్తున్న టెక్నీషియన్ దాని ఫలితాన్ని చవిచూశాడు. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని తిరుచ్చి జిల్లా ఉరయూర్ కి చెందిన సురేష్ (45) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. పని కోసం ఉరయూర్ నుంచి తూతుక్కుడి బయల్దేరి వెళ్లాడు. బస్సులో మెజారిటీ సీట్లు ఖాళీగా ఉండడంతో బస్సులోని సీట్లపై ఓ కునుకు తీద్దామని భావించి, పనిముట్ల కిట్ ను తలకింద పెట్టుకుని నిద్రపోయాడు. ఆ రోడ్డు గతుకులమయంగా ఉండడంతో కుదుపులకి కిట్ తెరుచుకుని ఓ స్క్రూ డ్రైవర్ నేరుగా అతని మెదడులోకి దిగబడిపోయింది. అతని వేదన గ్రహించిన తోటి ప్రయాణికులు తూతుక్కుడి ఆసుపత్రికి తరలించారు. నాలుగు గంటల శస్త్రచికిత్స నిర్వహించి అతని మెదడులో దిగబడిన స్క్రూ డ్రైవర్ ను తొలగించారు. అతనికి ప్రాణాపాయం లేనప్పటికీ, శరీరావయవాల పనితీరును కొన్ని రోజులపాటు పరిశీలించాలని వైద్యులు తెలిపారు.