: ఛోటా రాజన్ ను భారత్ కు రప్పించే ప్రక్రియ షురూ
ఇండోనేసియాలోని బాలిలో అరెస్టైన మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ రప్పించే ప్రక్రియ వేగవంతమైంది. భారత్-ఇండోనేసియా మధ్య 2011లోనే నిందితులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం జరిగింది. అయితే, అది ఇంతవరకు అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఛోటా రాజన్ కేసు విషయంలో నిందితులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం అమలు ప్రక్రియను ఇరు దేశాలు వేగవంతం చేశాయి. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆదివారం ఇండోనేసియాను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పరస్పర న్యాయసహకారంపై ఇరు దేశాల అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకోనున్నారు. దీంతో ఛోటా రాజన్ ను భారత్ రప్పించడం సులువవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.