: నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడతాం!: కేసీఆర్ తో చైనా కంపెనీల ప్రతినిధులు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చైనా కంపెనీల ప్రతినిధులు ఈరోజు కలిశారు. వంతెనలు, టన్నెళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ ఒడ్డున అతిపెద్ద టవర్ నిర్మాణానికి 85 శాతం ఖర్చును భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా అంగీకారం తెలిపిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీనది, దుర్గం చెరువుపై బ్రిడ్జిలను తక్కువ సమయంలో పూర్తి చేస్తామని కేసీఆర్ కు వారు హామీ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News