: టీవీ షో నుంచి కోపంగా వెళ్లిపోయి...తీరిగ్గా క్షమాపణలు చెప్పిన పాప్ స్టార్
అభిమానులపై ఆగ్రహాన్ని ప్రదర్శించి, అర్థాంతరంగా లైవ్ షో నుంచి వెళ్లిపోయిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్, ఆనక తీరిగ్గా క్షమాపణలు చెప్పాడు. నార్వేయన్ టీవీ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు బీబర్ సిద్ధమవుతుండగా, ముందు వరుసలో కూర్చున్న అభిమానులు స్టేజ్ పై నీళ్లలాంటి ద్రవం చిమ్మారు. దానిని తుడిచేందుకు బీబర్ ప్రయత్నించగా, వారు అతనిని అడ్డుకున్నారు. బీబర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన బీబర్, ఆ టీవీ షో నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బీబర్ ఆ తర్వాత అభిమానులను క్షమాపణలు కోరాడు. తన షోను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఎదురు చూసి ఉంటారని, వారిని నిరాశపరచినందుకు క్షమాపణలు కోరుకుంటున్నానని బీబర్ చెప్పాడు.