: ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’పై కోర్టులో కేసు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో' ప్రొడ్యూసర్ మార్క్ గార్డన్ పై కోర్టులో కేసు వేశారు. సీఎన్ఎన్ లో 1990లో ప్రసారమైన డాక్యుమెంటరీ నుంచి ఏబీసీ ఎఫ్బీఐ డ్రామా ఆలోచనను కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్లు జామీ హెల్మన్, బార్బరా లిబోవిట్జ్ హెల్మన్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పౌలా పెయిజెస్ ఆరోపిస్తూ ఈ కేసు వేశారు. ముఫ్పై ఐదు పేజీలతో ఉన్న ఈ ఫిర్యాదును లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దాఖలు చేశారు. కాగా, ఈ ఫిర్యాదుపై మార్క్ గార్డన్ కంపెనీ వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.