: ఏంటీ పనుల నాణ్యత?: గుత్తేదార్లపై చంద్రబాబు ఆగ్రహం
పెన్నా బ్యారేజీ పనుల విషయంలో నాణ్యతా లేమిపై నెల్లూరులో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేశారు. నిధులను సకాలంలో కేటాయిస్తున్నప్పటికీ, పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇకపై ఇటువంటివి చూసీ చూడనట్టు వదిలేసేది లేదని ఆయన హెచ్చరించారు. ముందుగా అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. పెన్నా బ్యారేజీ పనుల పరిశీలన అనంతరం ప్రస్తుతం పోలీసు అతిథి గృహానికి చంద్రబాబు చేరుకున్నారు.