: అంతా కూల్...ఇబ్బందులు సహజమే: మధుప్రియ


అంతా కూల్...వివాహం హాయిగా జరిగిందని గాయని మధుప్రియ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఓ కల్యాణ మండపంలో వివాహం జరిగిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ప్రేమ కథలో ఇబ్బందులు సహజమని పేర్కొంది. ప్రేమ అంటేనే ఇబ్బందులు ఉంటాయని, అలాగే తన ప్రేమ కథలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, ఇబ్బందులొచ్చాయని ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేము కదా? అని ప్రశ్నించింది. బయటకి చెప్పుకోలేని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని మధుప్రియ పేర్కొంది. ఇప్పుడంతా కూల్ అని, వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించారని మధుప్రియ తెలిపింది. కాగా, కాగజ్ నగర్ లో వరుడు శ్రీకాంత్ తరపు బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరిగింది. మధుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వివాహానికి దూరంగా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News