: టి.కాంగ్రెస్ నాయకత్వంపై ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ అసంతృప్తి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, సంవత్సరకాలంగా పార్టీలో అవమానాలతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తనను అవమానించారని ఢిల్లీలో అన్నారు. రాహుల్ వచ్చినప్పుడు ఆహ్వాన బృందంలో తన పేరు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీలో తనను అవమానించినా వరంగల్ ఉపఎన్నికలో పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సే ముఖ్యమని స్పష్టం చేశారు. కాగా రాపోలు ఆరోపణలను వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఖండించారు. ఆయన ఆరోపణలు అవాస్తవమన్నారు. రాపోలుకు ఇప్పటికే ఫోన్ చేశామని, మెసేజ్ కూడా పెట్టామని చెప్పారు.