: భయపెట్టిన 'రాజుగారి గది'!... సినిమా చూస్తూ వ్యక్తి మృతి


గత శుక్రవారం థియేటర్లను తాకిన హారర్ కామెడీ చిత్రం 'రాజుగారి గది' చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన దురదృష్టకర ఘటన నేడు జరిగింది. హైదరాబాద్ లోని బహదూర్ పురా పరిధిలోని మెట్రో థియేటర్ లో ఈ మధ్యాహ్నం చిత్రం చూస్తూ, అమర్ నాథం (55) అనే వ్యక్తి కుర్చీలోనే గుండె ఆగి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్ కు చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు గంటల పాటు వినోదం పొందేందుకు సినిమాకు వెళ్లిన అమర్ నాథం మరణించడం, ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News