: కాగజ్ నగర్ లో మధుప్రియ-శ్రీకాంత్ వివాహం
ఎట్టకేలకు వర్థమాన గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారానికి శుభం కార్డు పడింది. ప్రియుడు బంగి శ్రీకాంత్ నే ఆమె వివాహం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో బంధుమిత్రుల సమక్షంలో కొద్దిసేపటి కిందట వారి పెళ్లి జరిగింది. అంతకుముందు మధుప్రియ వివాహానికి ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో మధ్యాహ్నం పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లిని అడ్డుకోవద్దని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. కొంత సమయం ఇస్తే తామే వివాహం చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా మధుప్రియ వినలేదు. రెండు సంవత్సరాలుగా శ్రీకాంత్ తనకు తెలుసునన్న ఆమె, నవంబర్ 2న హైదరాబాద్ లో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.