: మనిషి చనిపోయిన తర్వాత దుర్గంధం ఎందుకు వస్తుంది?


మనిషి బతికి ఉన్నంత కాలం శరీరం నుంచి ఎలాంటి చెడు వాసన రాదు. కానీ, చనిపోయిన తర్వాత దుర్వాసన ప్రారంభం అవుతుంది. సమయం గడిచే కొద్దీ భరించలేని దుర్గంధం విడుదలవుతుంది. దీనికి కారణం బ్యాక్టీరియా. ఇవి సూక్ష్మజీవులు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన ఇవి పరాన్న జీవులు. అంటే ఇతర జీవులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాయన్నమాట. మనిషి బతికి ఉన్నంత కాలం బ్యాక్టీరియా మన శరీరంలోని ఆహారాన్ని తమకు అనుగుణంగా మార్చుకుని తింటుంటాయి. ఈ క్రమంలో వాటి వల్ల కొన్ని రసాయనాలు విడుదల అవుతాయి. అయితే, మనిషి బతికున్న సమయంలో మన రక్షణ వ్యవస్థ ఆ రసాయనాలను నిర్మూలిస్తుంది. మనిషి మరణించిన తర్వాత ఆ వ్యవస్థ పనిచేయకపోవడంతో... శరీరంలో విడుదలయ్యే రసాయనాలు దుర్గంధాన్ని వెదజల్లుతాయి. అందువల్లే మనిషి కాని లేదా ఇతర జంతువు కాని చనిపోయిన తర్వాత ఆ దేహం నుంచి చెడు వాసన వస్తుంది.

  • Loading...

More Telugu News