: బీహార్ పాకిస్థాన్ భూభాగమా?: బీజేపీని ప్రశ్నించిన జేడీయూ


బీహార్ ను పాకిస్థాన్ లో భాగంగా బీజేపీ నేతలు భావిస్తున్నారా? అని జేడీయూ నేతలు ప్రశ్నించారు. పాట్నాలో వారు మాట్లాడుతూ, బీహార్ లో ఓటమిపాలవుతామన్న విషయాన్ని అర్థం చేసుకున్న బీజేపీ నేతలు పాకిస్థాన్ పేరు చెప్పి హిందువులను మభ్యపెడదామని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. బీహార్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా అమిత్ షా వ్యాఖ్యానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చంపారన్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, బీహార్ లో బీజేపీ ఓటమి పాలైతే పాకిస్థాన్ లో టపాసులు కాలుస్తారని ఆరోపించారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత సుశీల్ మోదీ కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి.

  • Loading...

More Telugu News