: రెండో భార్య రెహమ్ కు ఇమ్రాన్ ఖాన్ విడాకులు


పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాక్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, రెండో భార్య రెహమ్ ఖాన్ లు విడిపోయారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని పాక్ తెహ్రిక్ ఇన్ సాఫ్ అధికార ప్రతినిధి నయీమ్ ఉల్ హక్ ధ్రువీకరించారు. ఈ మేరకు పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు. విడాకుల విషయంపై మీడియా దుమారం రేపొద్దని, తమ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండాలని వారిరువురు కోరినట్టు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయాన్ని ఇమ్రాన్, రెహమ్ లు ట్విట్టర్ లో కూడా ధ్రువీకరించారు. పది నెలల కిందట పెళ్లైన వారిద్దరికీ ఇది రెండో వివాహమన్న సంగతి తెలిసిందే. రెహమ్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్ ఆమెకు తలాఖ్ చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News