: ఛత్తీస్ గఢ్ లో రెచ్చిపోయిన మావోయిస్టులు


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అక్కడి మైన్స్ కంపెనీకి చెందిన 22 వాహనాలను తగులబెట్టారు. కాంకేర్ జిల్లాలోని చార్‌గావ్ వద్ద ఈ సంఘటన జరిగింది. నిక్కో ఐరన్ ఓర్ మైన్స్‌కు చెందిన 22 వాహనాలను మావోలు తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మైన్స్ కంపెనీ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. కాగా, రాజ్‌నంద్‌గావ్ జిల్లా సావర్‌గావ్ సమీపంలో పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థుల గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News