: ఎంత చెప్పినా వినని మధుప్రియను వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు... ఈ సాయంత్రమే పెళ్లి!


18 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన తన తల్లిదండ్రుల కన్నా, ప్రేమించిన ప్రియుడే తనకు ముఖ్యమని వర్థమాన గాయని మధుప్రియ స్పష్టం చేసింది. ఈ ఉదయం నుంచి అమె తల్లిదండ్రులు కాగజ్ నగర్ పోలీసు స్టేషనులో ఎంతగా నచ్చజెప్పాలని చూసినా మధుప్రియ వినలేదు. పోలీసులు ఇరు కుటుంబాలనూ పిలిచి చర్చించగా, ఇప్పుడే పెళ్లి వద్దని, కెరీర్ పై దృష్టిని పెట్టాలని తొలుత కోరిన మధుప్రియ తండ్రి, ఆపై నవంబర్ 18న పెళ్లి చేసేందుకు అంగీకరించారు. అయితే, తాను తక్షణం శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమె పట్టుబట్టడంతో, ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు ఆమెను వదిలి వెళ్లిపోయారు. నేటి సాయంత్రం శ్రీకాంత్, మధుప్రియల జంటకు సిర్పూర్ కాగజ్ నగర్ లోని వాసవీ గార్డెన్స్ లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు హాజరు కాబోవడం లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News