: జయలలితపై అభ్యంతరకర పాటలు... కళాకారుడి అరెస్ట్


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై, అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటలు రాసి పాడిన జానపద కళాకారుడు ఎస్.సదాశివ్ అలియాస్ కోవన్ (45)ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి 2 గంటల సమయంలో తిరుచ్చి సమీపంలోని మార్తాండ కురుచ్చిలోని ఆయన నివాసంపై దాడి చేసిన పోలీసులు కోవన్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం చెన్నైకి తరలించారు. ఇతను రాష్ట్రంలో విప్లవ కార్యక్రమాలు చేస్తున్న మక్కల్ కాలై ఇలక్కియా కళగం వర్గానికి చెందనవాడని పోలీసులు తెలిపారు. కోవన్ పాడిన ఓ పాట సామాజిక మాధ్యమాల్లో చేరగా, అందులో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలున్నాయన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 124 (ఏ) ప్రకారం కేసు నమోదు చేసినట్టు వివరించారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న కోవన్ ను కలుసుకునేందుకు తాను యత్నించగా, పోలీసులు అనుమతించ లేదని న్యాయవాది జిమ్ రాజ్ మిల్టన్ ఆరోపించారు. తాను ఈ ఉదయం మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News